Tuesday, November 3, 2015

సాహిత్యానికీ సమాజానికీ సాన్నిహిత్యముడాలన్నది కొత్త భావనా? ప్రాచీన సాహిత్యంలో ఈ స్ఫురణ కనిపించ లేదా? - రావెల పురుషోత్తమ రావు
పురుషోత్తమరావు గారూ చాలా మంచి ప్రశ్న!
సమాజానికీ సాహిత్యానికీ సాన్నిహిత్యం లేనిదెన్నడు సాహిత్య చరిత్రలో? నా అభిప్రాయంలో మొట్ట మొదటి నుండీ ఉన్నదే. లిఖిత సాహిత్యానికి ముందు మౌఖిక సాహిత్యం లో ప్రజలు జానపదులు వారి జీవితాల గురించే, వారి సామాజిక జీవనం గురించే పాడుకున్నారు రాసుకున్నారు. లిఖిత సాహిత్యంలో అతి ప్రాచీనమైనదిగా చెప్పబడుతున్న హాలుని గాథా సప్త శతి లో ఆనాటి తెలుగు ప్రజల సామాజిక జీవనం ఆచారవ్యహారాలు కట్టుబాట్లు వగైరాలు అద్భుతంగా ప్రతిఫలించాయి. అంతకుముందే వందలాది కవులు రాసిన గాథలను శాతవాహనుడైన హాల మహారాజు గ్రంథస్తం చేసిన గాథా సప్తశతి, ప్రాకృత భాషలో భారతదేశంలో మన తెలుగు నేల మీద వెలసిన అతి ప్రాచీన లౌకిక సాహిత్యగ్రంథం. ఆనాటి తెలుగు ప్రజల జీవనానికి అద్దం పట్టిన గొప్ప సాహిత్యం.
అయితే సాహిత్యం క్రమంగా ప్రజలనుండి, ప్రజల జీవితాల నుండి దూరమై రాజాస్థానాల్లోకి, కవులు సాహిత్యకారులూ పాలకుల పంచల్లోకి చేరుకున్నంక రాజులూ పాలకులూ ఆదేశించిందే , ఆగ్నాపించిందే సాహిత్యమైంది. క్రమంగా జీవితానికీ, సమాజానికీ సాహిత్యం దూరమైంది. అయితే యే కవీ సాహిత్యకారుడూ శూన్యం లోనుండి సాహిత్యం సృష్టించడు. సృష్టించలేడు కూడా. సమాజంలోనివీ , సామాజిక జీవనంలోనివీ అంశాలు అనేకం సాహిత్యంలో తొంగిచూస్తూనే ఉంటాయి. యెందుకంటే సాహిత్యం ప్రదానంగా మనుషుల గురించీ, మానవసంబంధాల గురించీ, కాబట్టీ ఆ మనుషులు యే కాలంలో నైనా సమాజాలుగానే జీవించారు కాబట్టీ తప్పనిసరిగా సాహిత్యంలో యేదో ఓ రూపంలో సమాజం కనబడుతుంది. ఇది ప్రతిభావంతులైన మన ప్రాచీన కవుల సాహిత్యంలో స్పష్టంగా చూడవచ్చు. ‘బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి?’ అన్న పోతన పద్యంలో కనబడే సమాజమూ, సామాజిక స్పృహా యెంత గొప్పదో వేరే చెప్పాలా? అందుచేత కవులు నిజాయితీ గా సాహిత్యసృష్టి చేసిన సందర్భాలలో వారి సాహిత్యాల్లో ఆనాటి సమాజంతో సాన్నిహిత్యం కనడుతుంది. కాలక్రమేణా కవులు రాజాస్థానాలకు మరిగి రాజులనూ పాలకులనూ మెప్పించడానికే సాహిత్యం సృష్టించడలో మునిగిపోయినప్పుడు సాహిత్యం సమాజానికి దూరమైంది. ఊహాజనిత కాల్పనిక కథలూ, పాత్రలూ, నిజజీవితానికీ, వాస్తవిక పరిస్థితులకూ దూరమైన చిత్రణా వగైరాలూ సాహిత్యాన్ని ఒక దశలో సమాజానికి ఆమడ దూరం నెట్టేసిన మాట వాస్తవమే! దీనికి కారణాలూ సాహిత్య చరిత్రలో స్పష్టమే!
సాహిత్యంలో ఆధునికత ప్రవేశించినంక ‘సాహిత్యంలో సమాజం యథాతథంగా ప్రతిఫలించాలి’ , ‘సాహిత్యంలో సమాజం లోని వైరుధ్యాలను ప్రతిఫలించాలి’, ‘సమాజంలో, జీవితంలో వైరుధ్యాలకు పరిష్కారం సాహిత్యం చూపించాలి’, ‘సమాజంలోని సమస్యలకు పరిష్కారం సాహిత్యం వెతకాలి’,’పురోగామి అభిప్రాయాలతో సాహిత్య సృష్టి చేసి సమాజాన్ని ప్రగతిశీల మార్గంలో ముందుకు పోయేందుకు సాహిత్యం ఉపయోగపడాలి’,’ సమాజాన్ని మార్చే పురోగామి బాధ్యత సాహిత్యంపై నున్నది’,’ సాహిత్యం ప్రజలని విప్లవోన్ముఖులని చేయాలి’,’కదిలేదీ కదిలించేదీ పెనునిద్దర వదిలించేదీ సాహిత్యం’,’ ప్రజలని సాయుధం చేస్తున్న రెవొల్యూషనరీ నేటి కవి’ – లాంటి అనేక ఆధునిక భావనలు ముందుకొచ్చినయి. ఆధునిక సాహిత్య చరిత్రలో సాహిత్య సృష్టిపై , సృజనపై, మొత్తంగా ఆధునిక సాహిత్య కారులందరిపైనా ఈ ఆలోచనల ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. సాహిత్యకారులకు ప్రగతిశీల ప్రాపంచిక దృక్పథం తప్పనిసరి అనడం దగ్గరినుండీ వారు సాహిత్య సంస్థలుగా యేర్పడి ప్రగతిశీల కార్యాచరణలో పాలుపంచుకోవాలి, విప్లవోద్యమంలోపాలుపంచుకోవాలి అనడమూ మనం చూస్తాము. సాహిత్యానికి సమాజాన్ని ప్రతిబింబిచడమే కాదు, సమాజాన్ని మార్చాలి, సాహిత్యకారులు సమాజ మార్పులో భాగం కావాలి. సాహిత్యకారులు స్పష్టమైన ప్రాపంచిక దృక్పథతో చేసే సాహిత్య సృష్టి సమాజాన్ని మార్చడంలో గొప్ప చోదకశక్తిగా పనిచేసి ప్రదాన పాత్ర వహించడం మనం చూసాం కూడా! సమాజంలో స్వేచ్చాస్వాతంత్ర్యాలను, పురోగామి భావాలనూ ప్రతిష్టించి సమానత్వాన్నీ, దోపిడీ, పీడనా, అణచివేతలు లేని నూతన సమాజాన్ని సాధించటం కోసం సాహిత్యం కృషిచేయాలి, అదే గొప్ప సాహిత్య ప్రయోజనం అనేది ఒక ప్రబలమైన అభిప్రాయం.
అయితే సాహిత్యకారులూ, సాహిత్య విమర్శకులూ అందరూ ఇవే అభిప్రాయాలను సమర్థించరు. వీరిలో భిన్నాభిప్రాయాలు చాలా ఉన్నాయి. చాలా చర్చ జరిగింది. చర్చలో ఈ అభిప్రాయాలు మరింత పదును దేలినయి. పురోగమించినయి. ముఖ్యంగా కేవలం సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబిస్తే సరిపోదు దానిలో వైరుధ్యాలను నిజాయితీగా చిత్రించాలి. ఆ వైరుధ్యాలకు పరిష్కారం వెతకాలి. వీలయితే చూపించాలి. అయితే అది అతికినట్టు కాదు, సాహిత్యకారుడు కృతకంగా చొప్పించి కాదు, సహజంగా, సాహిత్యంలో చిత్రించిన పరిస్థితుల నుండే పరిణమించాలి. సమాజంలోని, జీవితంలోని , మానవసంబంధాల్లోని , మానవ నైజంలో లోని అనేక కోణాలని (చీకటికోణాలతో సహా) , బహుముఖత్వాన్ని, అనేక పొరలనీ సాహిత్యం నిజాయితీగా ప్రతిఫలించాలి. పాఠకున్ని ఆలోచింపజేయాలి, వారికి కర్తవ్యబోధ చేసే బదులు వారిలో అనేక భావాల, ఆలోచనల సంఘర్షణను కలిగించి మంచీ చేడూ (మళ్ళీ ఇవి యుగ్మ సమాధానాలుగా ఉండవు కూడా) నిర్ణయించుకోనిచ్చి, కార్యోన్ముఖుల్ని చేయాలి. సాహిత్యం పాఠకుని హృదయానికీ మేధకూ పని కల్పించాలి. హత్తుకోవాలి. వెంటాడాలి, నిరంతరంగా పాఠకుని వెన్నంటి ఉండాలి. విశ్వజనీనతను తాత్వికతనూ పొరలు విప్పి చూపించాలి. మొత్తంగా సాహిత్యం కేవలం జీవితాన్ని ప్రతిబింబిస్తేనో , కర్తవ్యబోధలో , నీతిబోధలో, మార్గనిర్దేశమో చేస్తేనో సరిపోదు (అట్లా చేస్తే అది యెక్కువ కాలం నిలబడదు) సమాజం పట్ల ఒక దృష్టి (vision) కలిగించాలి అప్పుడే అది చిరకాలం నిలుస్తుంది. పాఠకులకు తెలియని విషయాలు తెలియపరవడమే కాదు, బాగా తెలిసిన విషయాలలో తెలవని కోణాలని ఆవిష్కరించాలి, బాగా తెలిసినజీవితాన్ని మరపింపజేసి కొత్త కోణాలని చూపించి వినూత్నంగా ఆవిష్కరించాలి. మార్గనిర్దేశమేదో సాహిత్యం చేయకుండా, పాఠకుడే ఆ సాహిత్యం చదవడం ద్వారా పెంపొందిన తన ఆలోచన పరిశీలనా శక్తీ దృక్పథాల ద్వారా తనకూ సమాజానికీ మంచిదైన మార్గాన్ని యెంచుకోకగలగాలి. అదీ గొప్ప సాహిత్యం చేయగలిగే పనీ , చేయాల్సిన కర్తవ్యమున్నూ!

Thursday, October 22, 2015

గర్తపురి-5
================

గర్తపురి-5
================

వాగ్ధాటికి వేదికగాచిరస్థాయిగా నిలిచింది  వావిలాలపేరు
సామాన్యునికి అతిదగ్గరగా మసలడమే సాధారణంగా తన తీరు
ప్రజాప్రతినిధిగా అందరి  అభిమానం  పొందడమే ఆయన   సిరులు
ఓ విజ్ఞాన సర్వస్వంగా నిరంతరం అలరారు ఆయన కీర్తి చంద్రికల  ప్రభలు..

Monday, October 19, 2015

గర్తపురి-4
================

విద్యలకు రాజధానిగా
మా గర్తపురే దేశంతటా
విస్తరించిపోయి వెలుగులీనుతూ వుందెది.


ధనాధన్ మంటూ రవి కళాశాల
ఆదర్శంగా విదేశాల్లో సైతం
ఘనకీర్తితో వెలుగొండేది.


ఎందరో ఇంజనీర్లుగ, డాక్టర్లుగా
కావాలనుకునే విద్యార్ధులను
పోటీ పరీక్షల్లో ప్రధమగణ్యంగా
నిలబెడుతూ ఖ్యాతిగడించేది.
ఆతర్వాత తామరతంపరగా టూషన్ హోంలు
వెలసినా ఆకళాశాలముందు వెలవెలబోతూ వుండేవి.
క్రమశిఖణకు మారుపేరుగా కీర్తిని గడించింది.


ఎన్ని గన్లనైనా ఎదురొడ్డి తనస్థానం
 తానే సాలుసాలుకీనిలుపుకుని వుండేది.
====================================
గర్తపురి-3
==============


పండు  మిరపకూ,ఎండు మిరపకాయలకూ
మా వూరే ప్రాతినిధ్యం వహించేది.
మిర్చియార్డుకూడా మావూళ్ళోనే
వ్యాపార పరంగా  స్థిరంగా నిలిచి  వుండేది.
కాయతుదార్లు వూళ్ళో తిరిగి మిర్చీని
కొనడం బాగా జరుగుతుండేది.
బోరేల్లో మిరపకాయలు తొక్కుతూండడం
సరదాగా సాగుతుండేది.
ఆడ కూలీలకు కూడా  చేతినిండా పనిదొరికి
ఐదువేళ్ళూ లోపలికి పోవడానికి
త వంతుగా సాయడుతుండేది.
గోంగూరా, పండుమిరప  పళ్ళ పచ్చడి
ప్యారీ వారి జాడీల్లో చేతికందుబాటులో వుండేది.
అవసరమొచ్చినప్పుడల్లా రోట్లో నూరబడి
తిరగ మోత  [తాలింపుల] తో   ఘుమాయిస్తూ వుండేది.
****************************




.

మాగర్తపురికి[గుంటూరు] ఐదు  ఋతువులతో అనుబంధం చాలా తక్కువ
ఎక్కువగా గ్రీష్మాన్నే కౌగిలించుకుని కూర్చుంటుంది.
శ్రమచేయకుండానే చెమటలు పట్టించగల సామర్ధ్యం తనది.
ఇప్పుడు కొత్తరాజధానికో కొసలో ఉన్నట్లు కనిపించినా
గ్రీష్మానికి మా ఊరే తలమానికమై వెలుగొందుతుంది.

కాంక్రీటులమహారణ్యంలోనయినా  పచ్చని బయలు కనపడాలనే మాతపన.
సింగడు అద్దంకి పోయిమళ్ళీ వేగంగా  తిరిగి  వచ్చినా
 మా ఎండలు మాత్రం మమ్మల్నే నమ్ముకుని
ముమ్మూర్తులా రాజ్యాధికారం చేయడం ఖాయమనే  నాకుతోస్తుంది.

=========================================================
గర్తపురి-2
----------------

పొగత్రాగడం నేరంకానిరోజుల్లో
పొగాకు పంటా, పచ్చి పుగాకును కాల్చే బేరన్లూ
మాగుంటూర్లో దండిగా తలెత్తుకుని నిలిచాయి.
చాలామందినికోటీశ్వరులను చేసి
శ్రీమంతుల జాబితాలోకి వరుసగా చేర్చి మురిసాయి.
దొర,  నాటు పొగాకునూ రెండింటినీ పొలాలు పండించేవి.
పొగాకులో కలుపును 'మల్లె ' యంటూ పిలవడం జరుగుతుండేది.
కాలుస్తున్న పొగాకు ఘాటు మాత్రం ముక్కుల్లోకి దూరి
నసపెట్టించడం తుమ్ములు తెప్పించడం మొదలెడుతుండేది
.